రాష్ట్ర ముఖ్యమంత్రి వై.ఎస్.జగన్ మోహన్ రెడ్డి ఈ నెల 30 వ తేదీన ఉన్న కర్నూలు జిల్లా పత్తికొండ లో పర్యటన కార్యక్రమం వచ్చే జూన్ ఒకటవ తేదీకి మార్పు అయినట్లు జిల్లా కలెక్టర్ డా.జి.సృజన ఒక ప్రకటన లో తెలిపారు.. అనివార్య కారణాల వల్ల ఈ మార్పు జరిగిందని, ముఖ్యమంత్రి జిల్లా పర్యటన ఈ నెల 30 వ తేదీన కాకుండా వచ్చే జూన్ నెల ఒకటవ తేదీన ఉంటుందని కలెక్టర్ ఈ ప్రకటన లో పేర్కొన్నారు.