News
ఉపాధి కోసం వెళ్లి దుబాయిలో చిక్కుల్లో పడ్డ ఆదోని యువకుడు
దుబాయిలో నెలన్నర రోజులు సెంట్రింగ్ పనులు చేస్తే 2 లక్షలు జీతం ఇప్పిస్తానని నమ్మబలికి కర్నూలు జిల్లా ఆదోనికి చెందిన ఇమ్రాన్ అనే యువకుడిని ఓ ఏజెంట్ దుబాయి దేశానికి పంపించాడు. అక్కడి వారితో ఇబ్బందులు ఎదుర్కొంటున్నట్లు వీడియో తీసి షోషల్ మీడియాలో పోస్టు చేశాడు. కర్ణాటకకు చెందిన సయ్యద్ అనే ఏజెంట్ తనను మోసం చేశాడని, తనను భారతదేశానికి తిరిగి
పంపించాలని ఇమ్రాన్ వేడుకున్నాడు. బాధితుడు ఇమ్రాన్ తెలిపిన వివరాల మేరకు ఆదోని పట్టణంలోని నిజాముద్దీన్ కాలనీలో నివాసం ఉంటున్న ఇమ్రాన్ ఆర్థిక పరిస్థితి బాగా లేదు. దీంతో దుబాయికి వెళ్లి డబ్బులు సంపాదించి, ఆర్థికంగా స్థిరపడాలని అనుకునేవాడు. కర్ణాటక రాష్ట్రానికి చెందిన సయ్యద్ అనే ఏజెంట్ ఇమ్రాన్ ను కలిసి దుబాయిలో నెలన్నర రోజులు పాటు సెంట్రింగ్ పనులు చేస్తే రూ.2 లక్షలు జీతం వస్తుందని చెప్పాడు. దీనికి ఇమ్రాన్ ఒప్పుకున్నాడు. అప్పు చేసి ఏజెంట్ సయ్యద్ ద్వారా 2023 మార్చి 30వ తేదీన దుబాయికి వెళ్లాడు. ఆ తర్వాత అక్కడ తనను గదిలో పెట్టారన్నారు. 45 రోజులు గడిచినా తనను పనికి పంపించలేదన్నారు. అక్కడి వారు ఓ కాగితం తీసుకొచ్చి, నీ పేరుపై తాము బ్యాంకు క్రెడిట్ కార్డు
ద్వారా రుణాలు తీసుకుంటామని, సంతకం చేస్తే చాలని వేధిస్తున్నారన్నాడు. తాను సెంట్రింగ్ పనుల కోసం వెళ్తే.. ఇలా రుణాల కోసం సంతకం చేయ మని వేధిస్తున్నారని, గదిలో నుంచి బయటకు కూడా పంపడంలేదని వాపోయారు. తను పాస్పోర్టు, వీసా సైతం తీసుకున్నారని. కేంద్ర ప్రభుత్వం, దుబాయిలోని అంబసీ వారు స్పందించి తనను దుబాయి నుంచి భారతదేశానికి పంపించాలని కోరారు.
News
ఆదోని రైతు బజార్లో కూరగాయల హోల్సేల్, రిటైల్ ధరలు
ఆదోని 09-01-2026:
కర్నూలు జిల్లా ఆదోని రైతు బజార్లో శుక్రవారం కూరగాయల హోల్సేల్ మరియు రిటైల్ ధరలు ఈ విధంగా ఉన్నాయి. టమాట హోల్సేల్ 1kg. 18/- రూపాయలు, రిటైల్: 1kg 20/- రూపాయల ఉల్లి గడ్డలు హోల్సేల్ 1kg. 18/- రూపాయలు, రిటైల్: 1kg 20/- రూపాయలు


News
వైసీపీ రాష్ట్ర లీగల్ సెల్ సెక్రటరీగా ఆదోనికి చెందిన అడ్వకేట్ జీవన్ సింగ్ ఎంపిక
వైసీపీ రాష్ట్ర లీగల్ సెల్ సెక్రటరీగా ఆదోనికి చెందిన అడ్వకేట్ జీవన్ సింగ్ ఎంపిక కావడంపై ఆదోని న్యాయవాదులు హర్షం వ్యక్తం చేశారు. ఈ నియామకానికి సహకరించిన ఆదోని మాజీ ఎమ్మెల్యే వై. సాయి ప్రసాద్ రెడ్డికి జీవన్ సింగ్ కృతజ్ఞతలు తెలియజేశారు.ఈ సందర్భంగా ఆదోని న్యాయవాదులు మాజీ ఎమ్మెల్యే సాయి ప్రసాద్ రెడ్డిని ఘనంగా సన్మానించారు. పార్టీ కార్యకర్తలకు ఎల్లప్పుడూ అండగా నిలుస్తామని జీవన్ సింగ్ స్పష్టం చేశారు. వైసీపీ కార్యకర్తలపై అన్యాయంగా కేసులు నమోదు చేస్తే సహించేది లేదని, చట్టపరంగా బలమైన పోరాటం చేస్తామని ఆయన తెలిపారు.వైసీపీ లీగల్ సెల్ను మరింత బలోపేతం చేసి పార్టీ శ్రేణులకు న్యాయ సహాయం అందించడమే లక్ష్యంగా పనిచేస్తామని జీవన్ సింగ్ పేర్కొన్నారు.
News
కాటన్ అండ్ జిన్నింగ్ ఫ్యాక్టరీ లో అగ్నిప్రమాదం
కర్నూలు జిల్లా ఆదోని శివారు బసపురం రోడ్డు లో హరి కాటన్ & జిన్నింగ్ ఫ్యాక్టరీ లో విద్యుత్ షార్ట్ సర్క్యూట్ వల్ల భారీ అగ్ని ప్రమాదం చోటుచేసుకుంది. చెలరేగిన మంటలు మంటల్లో పత్తి బేలు కాలి బూడిద అయ్యాయి. వెంటనే స్పందించిన అగ్నిమాపక సిబ్బంది మంటలను అదుపు చేశారు. కోట్లలో ఆస్తి నష్టం వాటిల్లినట్లు యజమాని హరి యాదవ్ తెలిపారు.




