News
టీడీపీ యువనేత నారా లోకేష్ యువగళం పాదయాత్ర షెడ్యూల్
టీడీపీ యువనేత నారా లోకేష్ యువగళం వివరాలు:
ఇప్పటి వరకు నడిచిన మొత్తం దూరం 1268.9 కి.మీ.
ఈరోజు నడిచింది దూరం 16.2 కి.మీ.
100వ రోజు (15.05.2023) పాదయాత్ర వివరాలు
శ్రీశైలం అసెంబ్లీ నియోజకవర్గం(నంద్యాల జిల్లా)
ఉదయం
8.00 – బోయరేవుల క్యాంప్ సైట్ నుంచి పాదయాత్ర ప్రారంభం.
9.00 – ముత్తుకూరులో స్థానికులతో మాటామంతీ.
10.10 – పెద్దదేవలాపురంలో స్థానికులతో మాటామంతీ.
11.20 – సంతజూటూరులో స్థానికులతో మాటామంతీ.
11.40 – సంతజూటూరులో చెంచు సామాజికవర్గీయులతో ముఖాముఖి.
12.40 – సంతజూటూరులో భోజన విరామం.
సాయంత్రం
4.00 – సంతజూటూరు నుంచి పాదయాత్ర కొనసాగింపు.
5.15 – పరమటూరు క్రాస్ వద్ద స్థానికులతో మాటామంతీ.
6.10 – బండిఆత్మకూరులో స్థానికులతో మాటామంతీ.
6.35 – బండిఆత్మకూరు శివారు విడిది కేంద్రంలో బస.
News
ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా.. విద్యార్థుల విజయం..
ఢిల్లీ, జులై 25: కేంద్ర విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ తన పదవికి రాజీనామా చేశారు. నీట్ పోటీ పరీక్షలో పేపర్ లీక్, పరీక్షల నిర్వహణపై తలెత్తిన వివాదాలు, విద్యార్థుల ఆందోళనల నేపథ్యంలో ఈ పరిణామం చోటుచేసుకుంది. నీట్ పరీక్ష ప్రశ్నా పత్రం లీక్ వెలుగులోకి రావడంతో కేంద్ర ప్రభుత్వంపై తీవ్ర విమర్శలు వచ్చాయి. దేశవ్యాప్తంగా వేలాది మంది విద్యార్థులు నిరసనలు చేపట్టి, పేపర్ లీక్‌లపై కఠిన చర్యలు తీసుకోవాలని, అలాగే కేంద్ర విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా చేయాలని డిమాండ్ చేశారు. ఈ నేపథ్యంలో కేంద్ర ప్రభుత్వం పరీక్షల వ్యవస్థలో సంస్కరణలకు శ్రీకారం చుట్టింది. పబ్లిక్ ఎగ్జామినేషన్స్ (ప్రివెన్షన్ ఆఫ్ అన్‌ఫెయిర్ మీన్స్) సవరణ బిల్లు–2026 ముసాయిదాను విడుదల చేసి, పేపర్ లీక్‌లు, పరీక్షల అక్రమాలపై కఠిన శిక్షలు, భారీ జరిమానాలు, ఫాస్ట్ ట్రాక్ కోర్టులు, కాలపరిమితిలో విచారణ వంటి కీలక నిబంధనలను ప్రతిపాదించింది.

అంతేకాదు, మరో అడుగు ముందుకు వేసి కేంద్ర విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా చేయడం ఇప్పుడు ఈ వివాదానికి శాశ్వత పరిష్కారంగా నిలిచింది. మరోవైపు, ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామాతో కేంద్ర మంత్రివర్గంలో విద్యాశాఖ బాధ్యతలను ఎవరు చేపడతారనే అంశంపై ఆసక్తి నెలకొంది. త్వరలోనే కొత్త విద్యాశాఖ మంత్రిని నియమించే అవకాశం ఉంది. అయితే రాజీనామాపై కేంద్ర ప్రభుత్వం నుంచి అధికారిక ప్రకటన, రాష్ట్రపతి ఆమోదం, తదుపరి బాధ్యతల కేటాయింపుపై పూర్తి వివరాలు వెలువడాల్సి ఉంది. ఇదిలా ఉండగా, విద్యార్థి సంఘాలు ఈ పరిణామాన్ని స్వాగతిస్తూ, పరీక్షల వ్యవస్థలో పారదర్శకత, బాధ్యులపై కఠిన చర్యలు, దీర్ఘకాలిక సంస్కరణలు అమలు చేయాలని కేంద్రాన్ని కోరుతున్నాయి.
ఢిల్లీ మెట్రో స్టేషన్ లు తెచ్చుకున్నాయి..

News
ఆదోనిలో నిధి కోసం క్షుద్రపూజలు
ఆదోని మట్కావాడి వీధిలో క్షుద్రపూజల కలకలం.. ఉస్మాన్ వాలి ఇంట్లో పూజలు చేస్తుండగా పట్టుకుని దేహశుద్ధి చేసిన స్థానికులు.. నిమ్మకాయలు, గుడ్లు, తేలుతో ప్రత్యేక పూజలు నిర్వహించినట్లు గుర్తింపు.. నిందితులను అదుపులోకి తీసుకున్న టూ టౌన్ పోలీసులు..

కర్నూలు జిల్లా ఆదోనిలోని మట్కావాడి వీధిలో ఒక్కసారిగా భయాందోళనలు వ్యక్తమయ్యాయి. స్థానిక ఇంటి యజమాని ఉస్మాన్ వాలి ఇంట్లో గుట్టుచప్పుడు కాకుండా నిధి కోసం క్షుద్రపూజలు నిర్వహిస్తుండటాన్ని స్థానికులు గుర్తించారు. ఇంట్లో పెద్ద ఎత్తున వింత ముగ్గులు వేసి… నిమ్మకాయలు, కొబ్బరికాయలు, గుడ్లతో పాటు తేలును కూడా ఉంచి పూజలు చేస్తున్నట్లు స్థానికులు చూశారు. ఇంటి చుట్టూ ఎర్రటి నీళ్లు చల్లుతుండటంతో అనుమానం వచ్చిన వీధివాసులు ఒక్కసారిగా ఇంట్లోకి దూసుకెళ్లారు. యజమాని ఉస్మాన్ వాలితో పాటు ఆయన ఇద్దరు పిల్లలు, మరొక బయటి వ్యక్తి కలసి ఈ పూజలు చేస్తుండగా స్థానికులు రెడ్ హ్యాండెడ్‌గా పట్టుకున్నారు. పిల్లలు వీధిలో ఆడుకుంటూ ఉంటారని, ఏమైనా అవాంఛనీయ సంఘటనలు జరిగితే ఎవరు బాధ్యత వహిస్తారంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు. ఆగ్రహానికి గురైన స్థానికులు పూజలు చేస్తున్న వారికి దేహశుద్ధి చేసి టూ టౌన్ పోలీసులకు అప్పజెప్పారు. గత మూడు నెలలుగా అమావాస్య వచ్చిందంటే చాలు ఈ ఇంట్లో ఇలాంటి పూజలు జరుగుతున్నాయని వీధివాసులు ఆరోపిస్తున్నారు. కాగా, ఈ ఘటనపై ఇంటి యజమాని ఉస్మాన్ వాలి కుమారుడు మహబూబ్ బాషాను వివరణ కోరగా… ఇల్లు నిర్మించుకోవడానికి శాంతి పూజలు చేస్తున్నామని, స్వామీజీ చెప్పినందుకే ఈ పూజలు జరిపామని తెలిపారు. అయితే, ‘ముస్లింలు స్వాములను ఎలా నమ్ముతారు?’ అని ప్రశ్నించగా ఆయన సమాధానం దాటవేస్తూ మాట మార్చే ప్రయత్నం చేశారు.




News
ఆదోనిలో ఎస్ఎఫ్ఐ విద్యార్థిని విద్యార్థులు భారీ ర్యాలీ
కర్నూలు జిల్లా ఆదోని ఎస్ఎఫ్ఐ విద్యార్థి సంఘం ఆధ్వర్యంలో విద్యార్థిని విద్యార్థులు భారీ ర్యాలీ నిర్వహించారు. నీట్ పేపర్ లీకేజ్ కి బాధ్యత వహిస్తూ ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా చేయాలని , NTA రద్దు చేయాలని డిమాండ్ చేస్తూ ఎమ్మిగనూరు టర్నింగ్ నుండి పోస్ట్ ఆఫీస్ వరకు నిరసన ర్యాలీ నిర్వహించారు. ఎస్ఎఫ్ఐ జిల్లా ఉపాధ్యక్షుడు శ్రీనివాసులు మాట్లాడుతూ ఢిల్లీ జంతర్ మంతర్ వద్ద విద్యార్థులు శాంతియుతంగా నిర్వహిస్తున్న నిరసన పై పోలీసులు లాఠీ చార్జ్ చేయడం చాలా దారుణంఅని ఆగ్రహం వ్యక్తం చేశారు.

-
News2 weeks agoఆదోని నూతన ఆర్డీవో గా బాధ్యతలు స్వీకరించిన కె. అరుణా దేవి
-
News2 weeks agoకుప్పగల్ రైల్వేగేట్ సమీపంలో రోడ్డు ప్రమాదం ఒకరు మృతి..
-
News2 weeks agoఆదోనిలో ఆసక్తికర ఘటన.. వైరల్‌గా మారిన ఎమ్మెల్యే వ్యాఖ్యలు
-
News2 weeks agoతుంగభద్ర జలాశయానికి పెరుగుతున్న నీటి నిల్వ
-
News3 weeks agoవృద్ధురాలిని బావిలోకి తోసేసిన డిగ్రీ విద్యార్థి అరెస్ట్
-
News2 weeks agoతుంగభద్ర జలాశయానికి పెరుగుతున్న నీటి నిల్వ
-
News2 weeks agoనిజాముద్దీన్ కాలనీలో SIR ఓటర్ వెరిఫికేషన్
-
News9 hours agoఆదోనిలో నిధి కోసం క్షుద్రపూజలు
