Connect with us

News

కర్ణాటక సిద్ధరామయ్య ఇంట్లో విషాదం..

Published

on

▪️ సంబరాల్లో అపశృతి.
▪️కర్ణాటకలో కాంగ్రెస్ ఎన్నికలు ఫలితాల నేపథ్యంలో సంబరాలు చేస్తున్న తరుణంలో సిద్ధరామయ్య ఇంట్లో విషాదం.
▪️సిద్ధ రామయ్య సోదరి శివమ్మ భర్త కొద్దిసేపటి క్రితం గుండె పోటు తో కన్నుమూశారు.
▪️ పూర్తి వివరాలు ఇంకా తెలియాల్సి వుంది.

Continue Reading
Click to comment

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

News

జగన్ 2.0 యాప్ పోస్టర్ ఆవిష్కరన

Published

on

కర్నూలు జిల్లా ఆదోని వైఎస్ఆర్సిపి పార్టీ కార్యాలయంలో జగన్ 2.0 యాప్ పోస్టర్ ను ఆవిష్కరించిన మాజీ ఎమ్మెల్యే సాయి ప్రసాద్ రెడ్డి, ఎమ్మెల్సీ డాక్టర్ మధుసూదన్. ఈ సందర్భంగా మాజీ ఎమ్మెల్యే సాయి ప్రసాద్ రెడ్డి మాట్లాడుతూ వైఎస్ఆర్సిపి పార్టీ కార్యకర్తలపై కూటమి నాయకులు  చేస్తున్న అరాచకాలను ఈ యాప్ ద్వారా జగన్మోహన్ రెడ్డి కి తెలుపవచ్చు అన్నారు. పోస్టర్ విడుదల కార్యక్రమంలో వైఎస్ఆర్సిపి పార్టీ నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు.

జగన్ 2.0 యాప్ పోస్టర్ ను ఆవిష్కరించిన
Continue Reading

News

BREAKING ఏపీలో సర్ గడువు 24 వరకు పొడిగింపు

Published

on

ఏపీలో SIR గడువును పొడిగిస్తున్నట్లు ఎన్నికల కమిషన్ ప్రకటించింది. షెడ్యూల్ ప్రకారం ఇవాల్టితో గడువు ముగియనుండగా కొన్నిచోట్ల ప్రక్రియ పూర్తికాలేదు. దీంతో అన్ని పార్టీల విజ్ఞప్తులను పరిగణలోకి తీసుకొని ఈ నెల 24 వరకు గడువును పొడిగిస్తున్నట్లు తెలిపింది.

Continue Reading

News

తుంగభద్ర జలాశయానికి పెరుగుతున్న నీటి నిల్వ

Published

on

హోస్పేట: 13.07.0226:

తుంగభద్ర జలాశయానికి ఎగువ ప్రాంతాల నుండి వరద నీటి ప్రవాహం క్రమంగా పెరుగుతోంది. జులై 13 (సోమవారం) ఉదయానికి అందిన అధికారిక వివరాల ప్రకారం.. డ్యామ్ పూర్తి స్థాయి నీటి మట్టం 1633 అడుగులు కాగా, ప్రస్తుతం నీటి మట్టం 1602.0 అడుగులకు చేరుకుంది. మొత్తం 105.788 టీఎంసీల గరిష్ట నిల్వ సామర్థ్యం కలిగిన ఈ జలాశయంలో ప్రస్తుతం 24.355 టీఎంసీల నీరు నిల్వ ఉంది.

ప్రవాహాల వివరాలు:

  • ఇన్‌ఫ్లో (వరద నీటి రాక): గత 24 గంటల్లో సగటున 17152 క్యూసెక్కుల చొప్పున వరద నీరు వచ్చి చేరుతుండగా, ప్రస్తుతం లైవ్ ఇన్‌ఫ్లో 16807 క్యూసెక్కులుగా కొనసాగుతోంది.
  • అవుట్‌ఫ్లో (నీటి విడుదల): జలాశయం నుండి ప్రస్తుతం కాల్వల ద్వారా కేవలం 652 క్యూసెక్కుల నీటిని మాత్రమే బయటకు వదులుతున్నారు. నదికి ఎటువంటి నీటిని విడుదల చేయడం లేదు.

గత ఏడాదితో పోలిస్తే.. గతేడాది ఇదే సమయానికి తుంగభద్ర డ్యామ్‌లో భారీగా నీటి నిల్వలు ఉన్నాయి. పోయినేడు ఇదే రోజున డ్యామ్ నీటి మట్టం 1625.23 అడుగులుగా ఉండగా.. 77524 టీఎంసీల నీరు నిల్వ ఉంది. అలాగే గత పదేళ్ల సగటు నీటి నిల్వను పరిశీలిస్తే ఈ సమయానికి 38071 టీఎంసీలు ఉండేదని, ప్రస్తుతానికి గతేడాది కంటే నీటి నిల్వలు కాస్త తక్కువగానే ఉన్నప్పటికీ.. ఎగువ నుండి వస్తున్న ఇన్‌ఫ్లో కారణంగా నీటి మట్టం వేగంగా పెరుగుతోందని టీబీ బోర్డు సెక్షన్ అధికారి ఒక ప్రకటనలో తెలిపారు.

Continue Reading

Trending