News
ఐపీఎల్ క్రికెట్ బెట్టింగ్ కోటి రూపాయలు విలువచేసే నగదు వాహనాలు సీజ్..
◆ ఆదోనిలో ఐపీఎల్ క్రికెట్ బెట్టింగ్ నిర్వాహకులు ◆ ముఠా నలుగురు సభ్యులను అరెస్ట్..
◆ నిందితుల నుంచి 80 లక్షలు నగదు స్వాధీనం ఒక కారు రెండు బైకులు సీజ్
◆ పరారీలో మరో ఆరుగురు నిందితులు..
◆ వివరాలు వెల్లడించిన డిఎస్పి శివ నారాయణస్వామి
కర్నూలు జిల్లా ఆదోని పోలీస్ 3 టౌన్ పోలీస్ స్టేషన్ పరిధిలో ఐపిఎల్ బెట్టింగ్ నిర్వహిస్తున్న ముఠాను పోలీసులు అరెస్టు చేశారు. వారి వద్ద నుంచి 80 లక్షల నగదు ఒక కారు, రెండు స్కూటర్లు, నాలుగు సెల్ ఫోన్లు స్వాధీనం చేసుకున్నారు. డీఎస్పీ శివ నారాయణ స్వామి వివరాల మేరకు 2వ ముద్దాయి పింజరి హుస్సేన్ ఇంట్లో క్రికెట్ బెట్టింగ్ నిర్వహిస్తుండగా పోలీసులు దాడులు చేసి నలుగురు బోయ మహానంది, పింజరి హుస్సేన్, మహమ్మద్ ఖాసిం, వడ్ల రాఘవేంద్ర క్రికెట్ బెట్టింగ్ నిర్వహిస్తుండగా అరెస్ట్ చేశామని తెలిపారు. 4వ ముద్దాయి వడ్ల రాఘవేంద్ర గత ఐదు సంవత్సరాలుగా అక్రమంగా డబ్బులు సంపాదించాలని దురుద్దేశంతో ఈ బెట్టింగ్ వ్యవహారం నిర్వహిస్తున్నాడని డిఎస్పి తెలిపారు. మిగతా ముగ్గురు ముద్దాయిలు గత మూడు సంవత్సరాల నుంచి అతనితో కలిసి ఈ బెట్టింగ్ వ్యవహారం నడిపిస్తున్నారని మొదటి ముద్దాయి బోయ మహానంది పై 8 కేసులు ఉన్నాయని, 2వ ముద్దాయి పింజరి హుస్సేన్ పై 6 కేసులు, 3వ ముద్దాయి గింజరి మొహమ్మద్ ఖాసిం పై 4 కేసులు 4గో ముద్దాయి వడ్ల రాఘవేంద్ర చారి పై 4 కేసులు పట్టణంలోని వివిధ పోలీస్ స్టేషన్ల పరిధిలో వీరిపై కేసులు ఉన్నాయని డిఎస్పి వెల్లడించారు. వీరి వద్ద నుండి స్వాధీనం చేసుకున్న నగదు, వాహనాలు వీటి విలువ కోటి రూపాయల వరకు ఉంటుందని తెలిపారు.
ఈ దాడుల్లో పాల్గొన్న సిఐ శ్రీరామ్ ఎస్సై జయ శేఖర్ ఎస్సై చిన్న పీరయ్య సిబ్బంది నరేంద్ర మధు సోమేశ్ ఖాసిం వలి నరసింహ మంజు కుమార్ మురళి పోలీసులకు ఎస్పీ జి. కృష్ణ కాంత్ ఐపీఎస్ ఆదేశాల మేరకు డీఎస్పీ శివ నారాయణ స్వామి రివార్డులను అందజేశారు.



News
ఆదోని రైతు బజార్లో కూరగాయల హోల్‌సేల్, రిటైల్ ధరలు
ఆదోని 09-01-2026:
కర్నూలు జిల్లా ఆదోని రైతు బజార్లో శుక్రవారం కూరగాయల హోల్‌సేల్ మరియు రిటైల్ ధరలు ఈ విధంగా ఉన్నాయి. టమాట హోల్‌సేల్ 1kg. 18/- రూపాయలు, రిటైల్: 1kg 20/- రూపాయల ఉల్లి గడ్డలు హోల్‌సేల్ 1kg. 18/- రూపాయలు, రిటైల్: 1kg 20/- రూపాయలు


News
వైసీపీ రాష్ట్ర లీగల్ సెల్ సెక్రటరీగా ఆదోనికి చెందిన అడ్వకేట్ జీవన్ సింగ్ ఎంపిక
వైసీపీ రాష్ట్ర లీగల్ సెల్ సెక్రటరీగా ఆదోనికి చెందిన అడ్వకేట్ జీవన్ సింగ్ ఎంపిక కావడంపై ఆదోని న్యాయవాదులు హర్షం వ్యక్తం చేశారు. ఈ నియామకానికి సహకరించిన ఆదోని మాజీ ఎమ్మెల్యే వై. సాయి ప్రసాద్ రెడ్డికి జీవన్ సింగ్ కృతజ్ఞతలు తెలియజేశారు.ఈ సందర్భంగా ఆదోని న్యాయవాదులు మాజీ ఎమ్మెల్యే సాయి ప్రసాద్ రెడ్డిని ఘనంగా సన్మానించారు. పార్టీ కార్యకర్తలకు ఎల్లప్పుడూ అండగా నిలుస్తామని జీవన్ సింగ్ స్పష్టం చేశారు. వైసీపీ కార్యకర్తలపై అన్యాయంగా కేసులు నమోదు చేస్తే సహించేది లేదని, చట్టపరంగా బలమైన పోరాటం చేస్తామని ఆయన తెలిపారు.వైసీపీ లీగల్ సెల్‌ను మరింత బలోపేతం చేసి పార్టీ శ్రేణులకు న్యాయ సహాయం అందించడమే లక్ష్యంగా పనిచేస్తామని జీవన్ సింగ్ పేర్కొన్నారు.
News
కాటన్ అండ్ జిన్నింగ్ ఫ్యాక్టరీ లో అగ్నిప్రమాదం
కర్నూలు జిల్లా ఆదోని శివారు బసపురం రోడ్డు లో హరి కాటన్ & జిన్నింగ్ ఫ్యాక్టరీ లో విద్యుత్ షార్ట్ సర్క్యూట్ వల్ల భారీ అగ్ని ప్రమాదం చోటుచేసుకుంది. చెలరేగిన మంటలు మంటల్లో పత్తి బేలు కాలి బూడిద అయ్యాయి. వెంటనే స్పందించిన అగ్నిమాపక సిబ్బంది మంటలను అదుపు చేశారు. కోట్లలో ఆస్తి నష్టం వాటిల్లినట్లు యజమాని హరి యాదవ్ తెలిపారు.




