News
నాటు సారా తయారీ స్థావరాలపై పోలీసుల దాడులు
కర్నూలు జిల్లా ఆదోని పట్టణం రణమండల కొండల్లో నాటు సారా తయారీ స్థావరాలపై పోలీసులు దాడులు నిర్వహించారు సుమారు 300 లీటర్ల బెల్లం ఊట ధ్వంసం చేసి నాటుసారా తయారీ సామాగ్రిని నిర్వీర్యం చేశారు. నటుసార తయారు చేస్తున్న హనుమాన్‌నగర్‌కు చెందిన నాగరాజు, నిజాముద్దీన్ కాలనీకి చెందిన హనుమప్పలను , రమేష్ లను అదుపులోకి తీసుకొని వారిపై కేసు నమోదు చేసి రిమాండ్ కు తరలించారు.
నాటు సారా తరలిస్తున్న ముగ్గురు అరెస్ట్
కర్నూలు జిల్లా ఆదోని వన్ టౌన్ పోలీస్ స్టేషన్ పరిధిలోని మాసా మసీదు సమీపం లో ముగ్గురు వ్యక్తులు హనుమాన్ నగర్ కు చెందిన బోయ రమేష్ , బోయ నాగరాజు, బోయ హనుమప్ప సంచులు పట్టుకొని అనుమానాస్పదంగా తిరుగుతూ పోలీసులను చూసి పారిపోతుండగా పట్టుకొని సోదా చెయ్యగా వారి వద్ద నిషిద్ద నాటు సారాయి 20 లీటర్ల ఉండగా వారిని పట్టుకొని అరెస్టు చేసి కేసు నమౌదు చేసినట్లు 1 టౌన్ CI విక్రమసింహ తెలిపారు ఈ సోదాలలో సిబ్బంది రంగస్వామి, సుధీర్, ముస్తాక్ మరియు ఏక వీర లు పాల్గొన్నారు.

News
జగన్ 2.0 యాప్ పోస్టర్ ఆవిష్కరన
కర్నూలు జిల్లా ఆదోని వైఎస్ఆర్సిపి పార్టీ కార్యాలయంలో జగన్ 2.0 యాప్ పోస్టర్ ను ఆవిష్కరించిన మాజీ ఎమ్మెల్యే సాయి ప్రసాద్ రెడ్డి, ఎమ్మెల్సీ డాక్టర్ మధుసూదన్. ఈ సందర్భంగా మాజీ ఎమ్మెల్యే సాయి ప్రసాద్ రెడ్డి మాట్లాడుతూ వైఎస్ఆర్సిపి పార్టీ కార్యకర్తలపై కూటమి నాయకులు చేస్తున్న అరాచకాలను ఈ యాప్ ద్వారా జగన్మోహన్ రెడ్డి కి తెలుపవచ్చు అన్నారు. పోస్టర్ విడుదల కార్యక్రమంలో వైఎస్ఆర్సిపి పార్టీ నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు.

News
BREAKING ఏపీలో సర్ గడువు 24 వరకు పొడిగింపు
ఏపీలో SIR గడువును పొడిగిస్తున్నట్లు ఎన్నికల కమిషన్ ప్రకటించింది. షెడ్యూల్ ప్రకారం ఇవాల్టితో గడువు ముగియనుండగా కొన్నిచోట్ల ప్రక్రియ పూర్తికాలేదు. దీంతో అన్ని పార్టీల విజ్ఞప్తులను పరిగణలోకి తీసుకొని ఈ నెల 24 వరకు గడువును పొడిగిస్తున్నట్లు తెలిపింది.

News
తుంగభద్ర జలాశయానికి పెరుగుతున్న నీటి నిల్వ
హోస్పేట: 13.07.0226:
తుంగభద్ర జలాశయానికి ఎగువ ప్రాంతాల నుండి వరద నీటి ప్రవాహం క్రమంగా పెరుగుతోంది. జులై 13 (సోమవారం) ఉదయానికి అందిన అధికారిక వివరాల ప్రకారం.. డ్యామ్ పూర్తి స్థాయి నీటి మట్టం 1633 అడుగులు కాగా, ప్రస్తుతం నీటి మట్టం 1602.0 అడుగులకు చేరుకుంది. మొత్తం 105.788 టీఎంసీల గరిష్ట నిల్వ సామర్థ్యం కలిగిన ఈ జలాశయంలో ప్రస్తుతం 24.355 టీఎంసీల నీరు నిల్వ ఉంది.
ప్రవాహాల వివరాలు:
- ఇన్‌ఫ్లో (వరద నీటి రాక): గత 24 గంటల్లో సగటున 17152 క్యూసెక్కుల చొప్పున వరద నీరు వచ్చి చేరుతుండగా, ప్రస్తుతం లైవ్ ఇన్‌ఫ్లో 16807 క్యూసెక్కులుగా కొనసాగుతోంది.
- అవుట్‌ఫ్లో (నీటి విడుదల): జలాశయం నుండి ప్రస్తుతం కాల్వల ద్వారా కేవలం 652 క్యూసెక్కుల నీటిని మాత్రమే బయటకు వదులుతున్నారు. నదికి ఎటువంటి నీటిని విడుదల చేయడం లేదు.
గత ఏడాదితో పోలిస్తే.. గతేడాది ఇదే సమయానికి తుంగభద్ర డ్యామ్‌లో భారీగా నీటి నిల్వలు ఉన్నాయి. పోయినేడు ఇదే రోజున డ్యామ్ నీటి మట్టం 1625.23 అడుగులుగా ఉండగా.. 77524 టీఎంసీల నీరు నిల్వ ఉంది. అలాగే గత పదేళ్ల సగటు నీటి నిల్వను పరిశీలిస్తే ఈ సమయానికి 38071 టీఎంసీలు ఉండేదని, ప్రస్తుతానికి గతేడాది కంటే నీటి నిల్వలు కాస్త తక్కువగానే ఉన్నప్పటికీ.. ఎగువ నుండి వస్తున్న ఇన్‌ఫ్లో కారణంగా నీటి మట్టం వేగంగా పెరుగుతోందని టీబీ బోర్డు సెక్షన్ అధికారి ఒక ప్రకటనలో తెలిపారు.
-
News1 week agoఆదోని నూతన ఆర్డీవో గా బాధ్యతలు స్వీకరించిన కె. అరుణా దేవి
-
News1 week agoకుప్పగల్ రైల్వేగేట్ సమీపంలో రోడ్డు ప్రమాదం ఒకరు మృతి..
-
News1 week agoఆదోనిలో ఆసక్తికర ఘటన.. వైరల్‌గా మారిన ఎమ్మెల్యే వ్యాఖ్యలు
-
News4 weeks agoసూర్యుని చుట్టూ ఒక పెద్ద వృత్తాకార వలయం
-
News6 days agoతుంగభద్ర జలాశయానికి పెరుగుతున్న నీటి నిల్వ
-
News4 weeks agoఅదోనిలో 30 లక్షలు విలువ చేసే 35 బైక్‌లు స్వాధీనం
-
News2 weeks agoవృద్ధురాలిని బావిలోకి తోసేసిన డిగ్రీ విద్యార్థి అరెస్ట్
-
News5 days agoతుంగభద్ర జలాశయానికి పెరుగుతున్న నీటి నిల్వ
