News
టీడీపీ యువనేత నారా లోకేష్ పాదయాత్ర షెడ్యూల్
టీడీపీ యువనేత నారా లోకేష్ పాదయాత్ర వివరాలు:
ఇప్పటి వరకు నడిచిన దూరం – 1206.9 కి.మీ.
ఈరోజు నడిచిన దూరం 17.9 కి.మీ.
96వ రోజు (11-5-2023) యువగళం వివరాలు:
నందికొట్కూరు అసెంబ్లీ నియోజక వర్గం (నంద్యాల జిల్లా)
ఉదయం
7.00 – నందికొట్కూరు శివారు క్యాంప్ సైట్ నుంచి పాదయాత్ర ప్రారంభం.
8.30 – తార్టూరు క్రాస్ వద్ద గ్రామస్తులతో సమావేశం.
8.50 – మండ్లెం గ్రామంలో స్థానికులతో సమావేశం.
10.15 – తంగడంచ గ్రామంలో స్థానికులతో సమావేశం.
10.55 – తంగడంచలో బిసి సామాజిక వర్గీయులతో ముఖాముఖి.
11.55 – తంగడంచలో భోజన విరామం
సాయంత్రం
4.00 – తంగడంచ నుంచి పాదయాత్ర కొనసాగింపు.
4.20 – జూపాడుబంగ్లాలో తాండవ సామాజికవర్గీయులతో సమావేశం.
4.50 – ఎబిఎన్ చర్చిలో క్రిస్టియన్లతో సమావేశం.
5.10 – తాటిపాడు క్రాస్ వద్ద రైతులతో సమావేశం.
5.50 – తరిగొప్పుల క్రాస్ వద్ద బిసిలతో సమావేశం.
6.15 – బన్నూరు వద్ద స్థానికులతో సమావేశం.
6.40 –బన్నూరు శివారు విడిది కేంద్రంలో బస.
యువగళం పాదయాత్ర 1200 కి.మీ. పూర్తయిన సందర్భంగా శిలాఫలకాన్ని ఆవిష్కరణ.
నంద్యాల జిల్లా. 10వ తేదీ కొనసాగుతోన్న యువగళం పాదయాత్ర బుధవారం 95వ రోజుకు చేరుకుంది. నందికొట్కూరు నియోజకవర్గం అల్లూరులో 1200 కి.మీ మైలురాయిని చేరుకుంది.

యువగళం పాదయాత్ర 1200 కి.మీ. పూర్తయిన సందర్భంగా నారా లోకేష్
అల్లూరులో హంద్రీనీవా నుంచి మిడుతూరు ఎత్తిపోతల పథకం నిర్మాణానికి హామీ ఇస్తూ శిలాఫలకాన్ని ఆవిష్కరించారు. నందికొట్కూరు బహిరంగ సభలో మాట్లాడిన నారా లోకేష్ గారు పేదలు తమ గళం వినిపించే వేదిక యువగళం అని అన్నారు

News
ఆదోని రైతు బజార్లో కూరగాయల హోల్సేల్, రిటైల్ ధరలు
ఆదోని 09-01-2026:
కర్నూలు జిల్లా ఆదోని రైతు బజార్లో శుక్రవారం కూరగాయల హోల్సేల్ మరియు రిటైల్ ధరలు ఈ విధంగా ఉన్నాయి. టమాట హోల్సేల్ 1kg. 18/- రూపాయలు, రిటైల్: 1kg 20/- రూపాయల ఉల్లి గడ్డలు హోల్సేల్ 1kg. 18/- రూపాయలు, రిటైల్: 1kg 20/- రూపాయలు


News
వైసీపీ రాష్ట్ర లీగల్ సెల్ సెక్రటరీగా ఆదోనికి చెందిన అడ్వకేట్ జీవన్ సింగ్ ఎంపిక
వైసీపీ రాష్ట్ర లీగల్ సెల్ సెక్రటరీగా ఆదోనికి చెందిన అడ్వకేట్ జీవన్ సింగ్ ఎంపిక కావడంపై ఆదోని న్యాయవాదులు హర్షం వ్యక్తం చేశారు. ఈ నియామకానికి సహకరించిన ఆదోని మాజీ ఎమ్మెల్యే వై. సాయి ప్రసాద్ రెడ్డికి జీవన్ సింగ్ కృతజ్ఞతలు తెలియజేశారు.ఈ సందర్భంగా ఆదోని న్యాయవాదులు మాజీ ఎమ్మెల్యే సాయి ప్రసాద్ రెడ్డిని ఘనంగా సన్మానించారు. పార్టీ కార్యకర్తలకు ఎల్లప్పుడూ అండగా నిలుస్తామని జీవన్ సింగ్ స్పష్టం చేశారు. వైసీపీ కార్యకర్తలపై అన్యాయంగా కేసులు నమోదు చేస్తే సహించేది లేదని, చట్టపరంగా బలమైన పోరాటం చేస్తామని ఆయన తెలిపారు.వైసీపీ లీగల్ సెల్‌ను మరింత బలోపేతం చేసి పార్టీ శ్రేణులకు న్యాయ సహాయం అందించడమే లక్ష్యంగా పనిచేస్తామని జీవన్ సింగ్ పేర్కొన్నారు.
News
కాటన్ అండ్ జిన్నింగ్ ఫ్యాక్టరీ లో అగ్నిప్రమాదం
కర్నూలు జిల్లా ఆదోని శివారు బసపురం రోడ్డు లో హరి కాటన్ & జిన్నింగ్ ఫ్యాక్టరీ లో విద్యుత్ షార్ట్ సర్క్యూట్ వల్ల భారీ అగ్ని ప్రమాదం చోటుచేసుకుంది. చెలరేగిన మంటలు మంటల్లో పత్తి బేలు కాలి బూడిద అయ్యాయి. వెంటనే స్పందించిన అగ్నిమాపక సిబ్బంది మంటలను అదుపు చేశారు. కోట్లలో ఆస్తి నష్టం వాటిల్లినట్లు యజమాని హరి యాదవ్ తెలిపారు.




